Young Heroines Star Heroes: స్టార్ హీరోలే కావాలంటున్న యంగ్ బ్యూటీలు.. అందుకు కెరీర్ నే పాడుచేసుకుంటున్నారా?

ఏ ఇండస్ట్రీలో అయినా కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు.పాత హీరోయిన్స్ ఉన్నప్పటికీ కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు.

 Young Heroines Waiting Star Heros Neha Shetty Nabha Natesh Priyanka Jawalkar Det-TeluguStop.com

ఇప్పుడు హీరోయిన్ లకు డిమాండ్ బాగా ఉండడంతో వారు కూడా బిజీ అయిపోతున్నారు.అయితే స్టార్ హీరోలలో కొంత మంది స్టార్ హీరోయిన్ ల కోసమే ఎదురు చూస్తున్నారు.

ఇంకొంత మంది మాత్రం కొత్త వారి కోసం వెతుకుతున్నారు.

ప్రెజెంట్ మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అవుతున్న వారు ఎవరంటే.

రష్మిక మందన్న, పూజా హెగ్డే, సమంత, శృతి హాసన్ వంటి వారిని చెప్పుకోవచ్చు.వీరే స్టార్ హీరోలతో ప్రెజెంట్ సినిమాలు చేస్తున్నారు.అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే క్రేజ్ సంపాదించుకుంది ఎవరంటే శ్రీలీల, కృతిసెట్టి వంటి వారు అనే చెప్పాలి.

అయితే మన టాలీవుడ్ లో కొంత మంది మాత్రం స్టార్ హీరోల కోసం ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాలను కూడా వదులు కుంటున్నారు.

Telugu Krithi Shetty, Nabha Natesh, Neha Shetty, Sri Leela, Tollywood, Young, Yo

వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డీజే టిల్లు సినిమాతో మంచి హిట్ అందుకుని ఒక్క సినిమాతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నేహా శెట్టి గురించి చెప్పుకోవాలి.ఈమె ఈ సినిమా తర్వాత భారీ పారితోషికం డిమాండ్ చేయడమే కాకుండా స్టార్స్ పక్కనే ఛాన్స్ కావాలంటూ వచ్చిన అవకాశాలని వదులుకుంటుంది.

Telugu Krithi Shetty, Nabha Natesh, Neha Shetty, Sri Leela, Tollywood, Young, Yo

ఇక మరో బ్యూటీ ఎవరంటే ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాలో నటించిన ప్రియాంక జవాల్కర్ కూడా భారీ అవకాశాల కోసం వచ్చిన అవకాశాలను వదులుకుంటూ.సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం అందాలు ఆరబోస్తూ ఇక్కడే సమయాన్ని కరిగించేస్తుంది.ఇక మరో హీరోయిన్ కూడా ఈ లిస్టులో ఉంది.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ కూడా ఇలాగే సమయాన్ని వృధా చేస్తుంది.స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తాను అంటూ శపథం చేసి కూర్చుంది.మరి ఇలా చేస్తే అవకాశాలు సంగతి ఏమో కానీ ఉన్న వయసంతా వృధా అవ్వడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube