ఢిల్లీ పాటియాలా కోర్టుకు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాజరైయ్యారు.రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.కోర్టులో విచారణ నేపథ్యంలో పింకీ ఇరానీ కూడా హాజరైనట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో జాక్వెలిన్ కు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.అయితే జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించింది.జాక్వెలిన్ దర్యాప్తులో ఎప్పుడూ సహకరించలేదని, సాక్ష్యాలు తెరపైకి వచ్చినప్పుడే వెల్లడిస్తానని పేర్కొంది.
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.సుకేష్ ప్రభావవంతమైన వ్యక్తులతో పాటు చాలా మందిని మోసం చేశాడని ఆరోపించారు.200 కోట్ల రికవరీ కేసులో జాక్వెలిన్ నిందితురాలిగా ఆగస్టు 17న ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.