మన చుట్టూ ఉన్న సమాజంలో మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు.కొందరు మనుషులు ఎవరు ఏమనుకున్నా పర్లేదు అనుకుంటూ వారికి నచ్చినట్టుగా వారు బతికేస్తూ ఉంటారు.
ఇంకొందరు మాత్రం అందరితో కలిసి మాట్లాడుతూ నలుగురితో కలిసి తిరగడం తినడం నలుగురితో ప్రేమగా మెదులుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మైండ్ సెట్ తో ఉంటారు.
సాధారణంగా భార్యాభర్తలు అంటే ఒక భార్య ఒక భర్త.కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక నటి మాత్రం తానే భార్య తానే భర్త రెండు తానే అని అంటోంది.
అదెలా అని అనుకుంటున్నారా.ఒక నటి తనకు తానుగా తాళిబొట్టు కట్టుకుంది.ఇప్పటికే ఇటువంటి వారు ఎంతో మంది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఆడవారిని ఆడవారు పెళ్లి చేసుకోవడం, మగవారిని మగవారు పెళ్లి చేసుకోవడం, కొంతమంది ఆడవాళ్లు పెళ్లిళ్లపై ఆసక్తి లేక వారికి వారే తాళి బొట్టు కట్టుకుంటూ ఉంటారు.
మరి అలా తనకు తానుగా తాళిబొట్టు కట్టుకున్న ఆ నటి ఎవరు అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బుల్లితెర నటి కనిష్క సోని.తనను తానే పెళ్లాడింది.ఆ మధ్య ఈ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా నటి కనిష్క కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఆ వార్త విన్న పలువురు అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
ఆ వార్త ఏమిటి అన్న వివరాల విషయానికొస్తే.కనిష్క గర్భం దాల్చింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి ఆమె వరకు వెళ్లడంతో వెంటనే ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.నన్ను నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాకు నేనుగా గర్భం దాల్చలేను.
రుచికరమైన బర్గర్ లు , పిజ్జాలు ఇలా ఎన్నో తిన్నాను.దానివల్ల కొద్దిగా లావయ్యాను అంతే అని చెప్పుకొచ్చింది.