టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందడంతో పాటు ఆకట్టుకునే కథ మరియు కథనం తో సాగుతుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్న కారణం గా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మంకను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా ను తెలుగు తో పాటు అన్ని సౌత్ భాషల్లో మరియు హిందీ లో కూడా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ ను రప్పించడం తో పాటు కాస్త ఎక్కువ రిస్క్ తీసుకుని సినిమాను తెరకెక్కించడం జరిగింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 45 నుండి 50 కోట్ల రూపాయల వరకు అయ్యిందట.
దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కు తగ్గట్లుగా ఈ సినిమా వసూళ్లు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.

సినిమా కనీసం 55 నుండి 60 కోట్ల వసూళ్లు నమోదు చేస్తేనే సూపర్ హిట్ గా పరిగణించాల్సి ఉంటుంది.కనీసం 50 కోట్ల వసూళ్లు నమోదు చేసినా కూడా యావరేజ్ గానే పరిగణించవచ్చు.మరి యశోద సినిమా సూపర్ హిట్ అనిపించుకుంటుందా… యావరేజ్ గా నిలుస్తుందా అది కూడా లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
హీరోయిన్ గా సమంత వరుసగా కమర్షియల్ సినిమా లు చేస్తున్న సమయంలో ఇలాంటి విభిన్నమైన సినిమాలను చేయడం నిజంగా గొప్ప విషయం.ఇక సమంత గత కొన్నాళ్లుగా మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న విషయం తెల్సిందే.
ఈ సమయంలో సినిమా రావడం వల్ల ఆమె యాక్టివ్ గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయింది.అయినా కూడా జనాలు ఆమె యొక్క సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.







