తెలుగులో ఇటీవలె ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ అప్పుడే చూస్తుండగానే 9 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని పదవ వారంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ జరిగిన ప్రతిసారి కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ ఒకటి అయితే ఇనయ ఒకటే ఒక వైపు అని చెప్పవచ్చు.
ప్రతి ఒక్కరు కూడా ఆమెనే టార్గెట్ చేస్తూ ఉన్నారు.ఇక ఆర్జె సూర్యా బయటికి వెళ్లిన తర్వాత ఆమె పట్ల వ్యతిరేకత మరింత ఎక్కువ అయింది.
ప్రతి ఒక విషయంలో సూర్య కు వెన్నుపోటు పొడిచావు అంటూ ప్రతి ఒక్కరు ఆమెను వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు.
కాగా గతవారం ఇనయ నామినేషన్స్ లో హైలైట్ అయిన విషయం తెలిసిందే.
ఈ వారం కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది.ఎక్కువమంది ఇనయ ను టార్గెట్ చేశారు.
మరి ముఖ్యంగా దోస్తులు అనుకున్న ఇనయ, ఫైమా ల మధ్య శత్రుత్వం పెరుగుతోంది.రోజుకి వీరిద్దరూ బద్ధ శత్రువుల మారిపోతున్నారు.
ఈ క్రమంలోని తాజాగా విడుదల చేసిన ప్రోమోని బట్టి చూస్తే మారింత రేంజ్ లో గొడవపడినట్లు తెలుస్తోంది.నామినేషన్స్ లో భాగంగా నువ్వు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు అని ఫైమా నీ ఇనయ నామినేట్ చేయగా వెంటనే ఫైమా వెక్కిరిస్తున్నట్లుగా నువ్వు వెనక మాట్లాడే దానివి ఫేక్ నాన్న వెళ్ళు అంటూ వెక్కిరించింది.

అప్పుడు వెంటనే ఇనయ నువ్వు ఫేక్ యాక్టింగ్ చేస్తున్నావు నేను రియల్ గా ఉన్నాను అని ఇనయ అనడంతో ఈ హౌస్ లో ఎవరికీ నువ్వు నచ్చవని చెప్పింది ఫైమా.ఆ తర్వాత పైమా పదేపదే నువ్వు ఫేక్ ఫేక్ అంటూ నీ మొఖం కూడా నాకు చూపించకు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.కాగా అందరూ ఇనయ ను నామినేట్ చేయడంతో మిగతా కంటెస్టెంట్ లు అందరూ నవ్వుకుంటున్నారు.మొత్తానికి పదవ వారం నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది.







