చాలాకాలంగా ఇంటా బయటా ఏపీ అధికార పార్టీ వైసిపి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.
జనంలో వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని జగన్ గుర్తించారు.ఇక పార్టీలోను గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలోని అసంతృప్త నాయకులు పెరిగిపోతూ ఉండడం వంటివి ఎన్నికల సమయంలో ఇబ్బంది కలిగిస్తాయనే టెన్షన్ జగన్ కు ఉంది.ఇది ఇలా ఉంటే.ఈ తరహా రాజకీయాల కారణంగానే మాజీ హోంమంత్రి, ప్రస్తుత పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణలోనే సుచరితకు రాష్ట్ర హోం మంత్రిగా అవకాశం కల్పించారు.
అంతకు ముందు నుంచి సుచరిత కు వైసిపిలో మంచి ప్రాధాన్య దక్కుతూ వచ్చేది.
అయితే తన మంత్రి పదవిని జగన్ రెన్యువల్ చేస్తారని సుచరిత భావించగా, ఆమె స్థానంలో కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనితకు జగన్ అవకాశం కల్పించారు.పెద్దగా పార్టీ కార్యక్రమాలలోనూ ఆమె పాల్గొనడం లేదు.
నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారు.దీంతో సుచరిత కు తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలుగా ఆమెను నియమించారు.
అయితే పార్టీలోని గ్రూపు రాజకీయాలు తదితర కారణాలతో జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, జిల్లా అధ్యక్ష పదవి ఉన్నా అది అలంకారప్రాయంగానే ఉందని సుచరిత అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.అయితే ఎమ్మెల్యే గానే ఆమె కొనసాగుతారని , పూర్తిగా నియోజకవర్గానికి పరిమితమవుతరని సుచరిత అనుచరులు చెబుతున్నారు.ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేకపోవడం తో , నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకే సుచరిత ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నా.
ఆమె మాత్రం మొదట్లో వైసీపీలో తనకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వడం లేదని , తనను ఎవరు లెక్క చేయడం లేదనే అసంతృప్తితోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.ఈ విషయంలో వైసిపి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో ?
.