నేటి ఫ్యాషన్ ట్రెండ్స్ చాలా వేగంగా, వింతగా మారిపోతున్నాయి.సోషల్ మీడియాలో ఈ ట్రెండ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
కాగా రీసెంట్‌గా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక ఫ్యాషన్ డ్రెస్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఈ డ్రెస్ రంగులను మార్చుకుంటూ అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.
ఇజ్జి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కలర్ మారగల తన డ్రెస్ ను ఓ వీడియో ద్వారా చూపించింది.ఈ వీడియోలో ఆమె దుస్తులు సూర్యకాంతిలోకి వెళ్ళగానే పింక్ కలర్ లోకి మారిపోయింది.
మొదటగా ఈ డ్రెస్ వైట్ కలర్ లో ఉంది.కాగా ఎండలోకి వెళ్ళగానే అది గులాబీ రంగులోకి మారిపోయింది.“అబ్బాయిలు, నా స్కర్ట్ రంగు మారుతుంది? ఇది రంగును కూడా మారుస్తుంది,” అని ఆమె వీడియోలో పేర్కొంది.ఆమె ధరించిన తెల్లటి దుస్తులు.సూర్యకాంతి కింద బయటికి వెళ్ళే ముందు, ఆమె ఇలా చెప్పింది, “ఎండలో వెళ్దాం.” ఆ యువతి సూర్యకాంతిలోకి అడుగు పెట్టినప్పుడు, ఆమె తెల్లటి దుస్తుల రంగు అద్భుతమైన గులాబీ రంగులోకి మారినట్లు వెంటనే కనిపించింది.

అయితే ఇదొక ఫ్యాషన్ సైన్స్ అని, డ్రెస్ స్టైల్ అద్భుతంగా ఉందని దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తమకు కూడా ఇలాంటి డ్రెస్సే కావాలని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలలో లైక్స్ వచ్చాయి.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.







