Ram Pothineni Director Anudeep: ఇస్మార్ట్ శంకర్ తో జాతిరత్నాలు డైరెక్టర్.. నిజమేనా?

జాతిరత్నాలు సినిమాతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కె వి. ఈ సినిమా కంటే ముందు పిట్టగోడ అనే ప్లాప్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

 Ram Pothineni Film With Jathi Ratnalu Director Anudeep Details, Prince Movie, An-TeluguStop.com

ఈ సినిమా ప్లాప్ తర్వాత జాతిరత్నాలు సినిమా చేసాడు.ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అనుదీప్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.ఇక ఈ సినిమా తర్వాత అనుదీప్ తమిళ్ హీరో శివకార్తికేయన్ తో బైలింగ్వన్ సినిమా ప్రిన్స్ చేసాడు.

మరి ఈయన సినిమాల్లో కూడా కామెడీతో బాగా అలరిస్తాడు.కానీ వరుసగా ఇలాంటి సినిమాలు చేసిన ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారు కాబట్టి మూడవ సినిమాను కొద్దిగా డిఫెరెంట్ గా తీసాడు.

కానీ ఇది జాతిరత్నాలు అంత ఆకట్టుకోలేదు.

తమిళ్ లో వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించినా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

అయినా అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.ఇదిలా ఉండగా బయట కూడా అనుదీప్ యాటిట్యూడ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఈయన స్టేజ్ మీద స్పీచ్ ఇస్తే అంతా అలా వింటూ ఉండాల్సిందే.

Telugu Anudeep Kv, Jathi Ratnalu, Prince, Ram Pothineni, Rampothineni-Movie

ఈయన మ్యాజిక్ అందరికి నచ్చి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.ఈయన ప్రెసెంట్ మూడు బడా సంస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నట్టు టాక్.ఇది పక్కన పెడితే ఈయన ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని కోసం కథ రాసినట్టు టాక్ వస్తుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈయన కోసమే దీనిని రాసుకోగా రామ్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.అయితే రామ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళదు.

ఈ గ్యాప్ లో నిర్మాతలు రెడీగా ఉన్నారు కాబట్టి అనుదీప్ మరో సినిమా చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube