కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది.ఈ సందర్భంగా గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
దీంతో రానున్న రెండు నెలలలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈసీ విడుదల చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే గుజరాత్ రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాల నుండి బీజేపీ హవా కొనసాగుతూ ఉంది.
కానీ ఈమధ్య ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతూ ఉంది.
మరి రానున్న ఎన్నికలలోబీజేపీ మళ్ళీ గెలుస్తుందా అన్నది చాలా సందేహంగానే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.ఇటీవల కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనలో వందలాది మంది చనిపోవడంతో బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటన జరిగిన తర్వాత రెండు నెలలలో ఎన్నికలు వస్తూ ఉండటంతో… పొలిటికల్ గా బీజేపీకి రానున్న ఎన్నికలలో గెలుపు అంత సులువు కాదు అన్న టాక్ నడుస్తోంది.







