టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ నేతలు చిరంజీవిపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ వెయిన్ ఓవెన్ వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే చిరంజీవి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ తో కలిసి చిరంజీవి ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.
ఆ తరువాత మెగాస్టార్ తన ఇంట్లో అతిధి మర్యాదలు చేస్తూ బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఓవెన్ కు ఆంధ్ర స్పెషల్ ఆవకాయను కూడా రుచి చూపించారు.అయితే చిరంజీవిని కలిసిన తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేట్ చేశాడు.ఇదే విషయంపై పలువురు కాంగ్రెస్ మద్దతు దారులు చిరంజీవిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదిక మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నీకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది.కేంద్ర మంత్రిని కూడా చేసింది.అలాగే నీ కోరిక మేరకు మీ పార్టీకి చెందిన ఇద్దరికి రాష్ట్రంలో మంత్రి పదవులు కూడా ఇచ్చింది.అటువంటి కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏమి ఇచ్చావు.
ఇటీవల కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే కనీసం సోషల్ మీడియా కూడా స్పందించలేదు ఎందుకు అంటూ చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు.కాగా ఈ విషయంపై పలువురు కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
అలాగే నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని తెలిసి కూడా ఎందుకు చిరంజీవి స్పందించలేదు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటుంటే సోషల్ మీడియాలో ట్వీట్ ఎందుకు వెయ్యలేదు అంటూ కొందరు చిరంజీవిపై మండిపడుతున్నారు.అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.కానీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ను కలవడం అంటే చిన్న విషయం కాదని, డిప్యూటీ కమిషనర్ సైతం చిరంజీవిని కలిసిన తర్వాత ఆయన సేవా కార్యక్రమాన్ని కొనియాడడంతో కొందరు అది జీర్ణించుకోలేక కావాలనే పనిగట్టుకుని చిరంజీవిపై ఏ విధంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.