Bhuvneshwar Kumar India Vs South Africa: దక్షిణాఫ్రికాతో టీమిండియా ఓటమికి ఇదే కారణం అని చెప్పినా భువనేశ్వర్ కుమార్..

టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో ప్రారంభమై అన్ని క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు రసవత్తంగా జరుగుతున్నాయి.టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.కోహ్లీకి తోడుగా సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు.దీని కారణంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నా టీమిండియా కు ఆదివారం పెర్త్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది.

 Team India Bowler Bhuvneshwar Kumar Clarity On India Loss To South Africa In Icc-TeluguStop.com

ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.భారత టాపార్డర్ కుప్పకూలడం సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఆఫ్ సెంచరీ చేయడం వల్ల టీమిండియా కు పోరాడే స్కోర్ వచ్చింది.

133 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంతో సఫారీలు తడబడినప్పటికీ, చివరి ఓవర్‌ వరకు టీమిండియా పోరాడిన, దక్షిణాఫ్రికా చివరకు విజయం సాధించింది.ఈ ఓటమిపై భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ కు మెరుగైన ఫీల్డింగ్ తోడై ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పారు.12వ ఓవర్ మార్కరమ్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ జారవిడిచాడని,13వ ఓవర్‌లో మార్కరమ్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ మిస్ చేశాడని చెప్పాడు.

Telugu Cricket, Icc Twc, Ind Sa, India, India Africa, Marcram, Africa, Virat Koh

ఇలా ఒకే బ్యాట్స్మెన్ కు రెండుసార్లు లైఫ్ లో రావడం వల్ల ఆ లైఫ్‌ లను మార్కరమ్ సద్వినియోగం చేసుకుని దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించాడని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు.భువనేశ్వర్ కుమార్ ఇంకా మాట్లాడుతూ టి20 ప్రపంచ కప్ మ్యాచ్ అనే కాదు ఏ సాధారణమైన మ్యాచ్లో అయినా క్యాచ్‌లు, రనౌట్‌లు మిస్ చేసుకోవడం వల్ల ప్రత్యర్థి జట్టుకు గెలవడానికి మనం అవకాశం ఇచ్చినట్లే అని భువనేశ్వర్ పేర్కొన్నాడు.అలాగే, పిచ్ నుంచి వచ్చిన అదనపు పేస్, బౌన్స్ భారత టాపార్డర్‌ను దెబ్బతీసిందని కూడా భువనేశ్వర్ కుమార్ చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube