ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గడిచిన కొన్నేళ్లుగా తెలుగు జాతి, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి ఎంతో కృషి చేస్తోంది.ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు వెలుగుల కోసం పరితపిస్తోంది.
ఈ క్రమంలోనే నెల నెల తెలుగు వెలుగు అనే కార్యక్రమాన్ని ప్రతీ నెల ఆఖరి ఆదివారం లో నిర్వహిస్తోంది.ఇందులో భాగంగానే ఈ సారి కూడా అక్టోబర్ 30 వ తేదీన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో గ్రంధాలయాల గురించిన చర్చ ను, గ్రంధాలయాల ప్రాముఖ్యతను, ప్రస్తుత పరిస్థితులలో గ్రంథాలయాల దుస్థితిని గూర్చి చర్చా వేదికను 41 వ సాహిత్య వేదిక ద్వారా చర్చించింది.
వర్చువల్ విధానం ద్వారా ఏర్పాటు చేసిన ఈ చర్చ కార్యక్రమానికి ఎంతోమంది తెలుగు భాష పండితులు తెలుగు భాషాభిమానులు హాజరయ్యారు.తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అందరికీ ఆహ్వానం పలుకుతూ చర్చ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఈ చర్చలో గ్రంధాలయాల ప్రాముఖ్యతను గురించి, అలాగే గ్రంధాలయాల అభివృద్ది లో తోడ్పడి ప్రోత్సహించిన వారికి అందజేసిన అవార్డుల గురించి కూడా ప్రస్తావించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల నుంచి గ్రంథాలయ సంస్థల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.కర్నూల్ నుంచి గాడిచర్ల ఫౌండేషన్ తరపున అధ్యక్షులు చంద్రశేఖర కురాడి పాల్గొనగా, గుంటూరు నుంచి అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణ, అలాగే వరంగల్ నుంచి శ్రీ రాజ రాజ నరేంద్ర భాషా నిలయం తరఫున కార్యదర్శి కుందా కృష్ణమూర్తి, శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం హైదరాబాద్ గౌరవ కార్యదర్శి పాల్గొన్నారు.తానా ఏర్పాటు చేసిన ఈ వేదికలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని, చర్చ వేదికలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థల నిర్వాహకులు తానా ను అభినందించారు
.






