కర్ణాటక గాయకురాలు, స్వరకర్త, మానవతావాది, వక్త అరుణా సాయిరామ్‌ను ఫ్రెంచ్ ప్రభుత్వం తన అత్యున్నత పురస్కారం ‘‘Chevalier de l’Ordre des Arts et des award’’తో సత్కరించింది.తన గాన నైపుణ్యానికి మాత్రమే కాకుండా, ఇండో- ఫ్రాన్స్ సంబంధాల అభివృద్ధికి ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ అవార్డును చెన్నైలోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ లిస్ టాల్బోట్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
అరుణ తన ప్రదర్శనల ద్వారా కర్ణాటక సంగీత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చారని అన్నారు.ఫ్రెంచ్ కళాకారులతో కలిసి మీ ఉమ్మడి కార్యక్రమాలు , ఫ్రాన్స్‌లో తరచుగా ప్రదర్శనలతో మీరు రెండు దేశాలను దగ్గరకి తీసుకురావడానికి , రెండు దేశాల మధ్య సాంస్కృతిక, కళాత్మక సహకారాన్ని పెంపొందించడానికి దోహదపడ్డారని కాన్సుల్ జనరల్ ప్రశంసించారు.
ఫ్రెంచ్ పురస్కారంపై అరుణా సాయిరామ్ స్పందిస్తూ.సంగీత విద్వాంసురాలిగా, మన దేశ సుంపన్నమైన సాంస్కృతిక వారసురాలిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానని అన్నారు.ఈ క్రమంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నందుకు సంతోషంగా వుందన్నారు.అరుణా సాయిరామ్.
తన తల్లి రాజలక్ష్మీ సేథురామన్ వద్ద క్లాసికల్ శిక్షణ ప్రారంభించారు.ఆ తర్వాత ఆమె పురాణ గాయకురాలు, సంగీత కళానిధి టీ.బృందాకి శిష్యురాలయ్యారు.తద్వారా ఎనిమిది తరాలకు పైగా తంజావూరు సంప్రదాయానికి చెందిన ప్రముఖ మహిళా గాయకుల శ్రేణిని కొనసాగించారు.
తర్వాత మనదేశానికి చెందిన దిగ్గజ సంగీతకారుల వద్దా పనిచేశారు.

ఇకపోతే.సంగీత ప్రపంచానికి అరుణా సాయిరామ్ చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.అలాగే సంగీత నాటక అకాడమీ వైఎస్ ఛైర్మన్‌గానూ ఆమె పనిచేశారు.
తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాస్ సమ్మాన్ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.యూఎస్ కాంగ్రెషనల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీని, న్యూయార్క్, శాన్‌డియాగో మేయర్ల నుంచి ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు.







