వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు సీఎం వైఎస్ జగన్ అదే విధంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇటీవల బీహార్ లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ఇంకా నితీష్ కుమార్ గెలుపు కోసం కష్టపడటం జరిగింది.
వాళ్లకంటే కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి ఉంటే బాగుండేది అనిపించింది.అంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు తాజాగా స్పందించారు.
జగన్ విషయంలో మూడు సంవత్సరాల తర్వాత ప్రశాంత్ కిషోర్ రియలైజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
అయితే ఇదే విషయంలో తనకి ఎనిమిది నెలలు పడితే ఇప్పుడు ప్రజలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని రఘురామకృష్ణరాజు తెలిపారు.
జగన్ పాలనకు సంబంధించి చాలామంది ప్రజలకు అర్థమయ్యిందని ప్రశాంత్ కిషోర్ లో ఈ మార్పు ఎలా వచ్చిందో తనకు తెలియదని అన్నారు.అదేవిధంగా అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించినట్లు చెప్పుకొచ్చారు.

అంత మాత్రమే కాదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో టీడీపి నేత పట్టాభి లేవనెత్తిన ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.బాబాయ్ హత్య కేసు విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి.వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం ఉందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.







