Journalist Prabhu: జర్నలిస్ట్ ప్రభు రచించిన పుస్తకాన్ని 4 లక్షలకు కొనుగోలు చేసిన రవి పనస 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జర్నలిస్ట్ ప్రభు అంటే తెలియని వాళ్ళు ఉండరు.నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీతో మమేకమై తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరిగే వార్తలు విశేషాలను తెలుగు ప్రేక్షకులకు పత్రికల ద్వారా ఎప్పటికప్పుడు అందజేస్తుండేవాడు.

 Ravi Panasa Bought A Book Written By Journalist Prabhu For 4 Lakhs Details, Rav-TeluguStop.com

తన కలం బలంతో ఇటు పాఠకులకి అటు ఇండస్ట్రీ పెద్దలు అందరికి సుపరిచితుడే.ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత సినీ జీవితంతో తన అనుభవాలతో “శూన్యం నుంచి శిఖరాగ్రలకు” అనే పుస్తకాన్ని రచించారు.

ఆ పుస్తకాన్ని తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు తన స్వహస్తాలతో విడుదల చేశారు. 

అయితే తోటి జర్నలిస్టు, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మరియు టి అర్ ఎస్ కార్యకర్త రవి పనస “శూన్యం నుంచి శిఖరాగ్రలకు” పుస్తకాన్ని 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి తన ఉదార స్వభావాలను చాటుకున్నారు.

ఆ పుస్తకాన్ని మెగాస్టార్ చేతులమీదుగా తీసుకుని ఆయన ఆశీర్వాదాలు కూడా అందుకున్నారు.అనంతరం రవి పనస మాట్లాడుతూ “నేను 20 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీ లో ఉన్నాను.

మెగా స్టార్ చిరంజీవి గారికి వీర అభిమాన్ని.నేను చిరంజీవి గారు చేసిన థంబ్స్ అప్ యాడ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను.

ఈరోజు ఈ ఫంక్షన్ కి రావటానికి కారణం చిరంజీవి గారు” అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube