ఏపీలో జనసేన పార్టీకి మరింత బలం పెరిగేలా కనిపిస్తోంది.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి జనసేన విషయంలో అంటి ముట్టనట్టుగానే వ్యవహరించేవారు.
పరోక్షంగా మద్దతు గా నిలబడుతున్నా.ప్రత్యక్షంగా ఆయన జనసేనకు మద్దతు ప్రకటించలేదు.
కానీ ఇటీవల ఓ సందర్భంలో పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ చిరంజీవి వ్యాఖ్యానించడంతో జనసేనలో ఉత్సాహం పెరిగింది.అయితే మొదటి నుంచి చిరంజీవి అభిమానులు జనసేన విషయంలో చిరంజీవి మాదిరిగానే అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించేవారు.
ఒకవైపు చిరంజీవి జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ ఉండడం, జగన్ పాలనను మెచ్చుకుంటూ ఉండడంతో జనసేనకు మద్దతు ఇచ్చే విషయంలో అనేక అనుమానాలు అందరిలోనూ తలెత్తుతూ వచ్చాయి.
గతంలోనూ చిరంజీవి అభిమాన సంఘాలు కొన్ని జనసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోగా.
తాజాగా తిరుపతిలో జరిగిన మెగా అభిమానుల సమావేశంలో చిరంజీవి అభిమానులంతా జనసేనకు అండగా నిలబడాలని తీర్మానానికి వచ్చారు.గతంలో ప్రజారాజ్యం సమయంలో కీలకంగా వ్యవహరించిన నాయకులంతా ఇప్పుడు జనసేనకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.
చిరంజీవి సున్నిత మనస్కుడని , అందుకే ఆయన ప్రజారాజ్యం స్థాపించినా.ఎక్కువకాలం రాజకీయాల్లో ఇమడలేకపోయారని మెగా అభిమానులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ… ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని, ఈ సమయంలో జనసేనకు మెగా అభిమానులంతా అండగా ఉండి జనసేన అధికారంలోకి వచ్చేలా చేయాలని నిర్ణయానికి వచ్చారు.
తిరుపతి వేదికగా జరిగిన ప్రజారాజ్యం పూర్వపు నాయకుల సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రవ్యాప్తంగా మెగా అభిమానులంతా జనసేన విషయంలో సానుకూలంగా ఉండడంతో ఆ పార్టీకి అదనపు బలం చేకూరినట్లు అయింది.ఇటీవల చిరంజీవి ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించిన దగ్గర నుంచి మెగా స్టార్ చిరంజీవి అభిమానులంతా జనసేనకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు.
దానిలో భాగంగానే ఇప్పుడు ఎక్కడికక్కడ మెగా అభిమానులు ఈ నిర్ణయాలు తీసుకుంటూ జనసేన బలాన్ని మరింత పెంచే పనుల్లో పడ్డారు.