టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సమంతకు సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈమె గురించి నిత్యం ఏదో ఒక రకమైన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే సమంత తాజాగా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.
ఇక సమంత సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ ట్వీట్ లో సమంత తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో.అటు ట్వీట్ చూసిన అభిమానులు,నెటిజన్స్ సమంత త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్స్ చేశారు.
అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం సమంత హెల్త్ కండిషన్ గురించి మీడియా ద్వారా స్పందిస్తూ సమంత త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి అక్కినేని అఖిల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
సమంత తొందరగా కోలుకోవాలి అని చిరంజీవి కోరుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా సమంత ఆరోగ్యం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఈ సందర్భంగా నాగబాబు ట్వీట్ చేస్తూ.సమంతతో నేను ఏ రోజు నేరుగా మాట్లాడక పోయినప్పటికీ.
ఆమె మయూసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది అన్న వార్త విని నా హృదయం ద్రవించి పోయింది.ఆ వార్త నన్ను తీవ్రంగా బాధించింది.
ఆమె త్వరగా కోలుకోవాలని, ఇంతకుముందు కంటే దృఢంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను.ఆమెను నేను ఎప్పుడు స్వతంత్ర మహిళగా,చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన ఆశావాద వ్యక్తిగా చూశాను.
ఆమె మయోసైటిస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగబాబు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.సమంతకు తన అభిమానుల ప్రేమ,అభిమానాలే శ్రీరామరక్ష అని అని తెలిపాడు నాగబాబు.
ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.