అష్టదిగ్బంధనంలో మునుగోడు

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికను అటు కేంద్రంలోని బీజేపీ,ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్,ప్రతిపక్ష కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా ఏర్పడ్డ ఘట్టుప్పల్ మండలంతో పాటు ఏడు మండలాలు,సుమారు 170 గ్రామాలు ఉన్నాయి.

 Antecedent In Octave-TeluguStop.com

ఒకట్రెండు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌లాగా ఏర్పాటు చేశారు.ఇలా మొత్తం 104 క్లస్టర్‌లను ఏర్పాటు చేసి,ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్ఐతో పాటూ 30 మంది సిబ్బందిని,సమస్యాత్మక,అత్యంత సున్నిత గ్రామాల్లో రాష్ట్ర పోలీసులతో పాటూ కేంద్ర బలగాలు భద్రతా విధులు నిర్వహించనున్నాయి.

వీరు రెండు బృందాలుగా విడిపోయి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.వీరికి ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో బస కల్పించాలని నిర్ణయించారు.

ఆయా గ్రామాల్లో ప్రచారానికి వచ్చే వివిధ పార్టీల ముఖ్యులు,గ్రామంలో చోటు చేసుకునే ఘర్షణలు,ఇతర ఘటనలు జరిగినప్పుడు ఆ సంబంధిత క్లస్టర్‌కు చెందిన ఎస్సైతో పాటూ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది.నియోజకవర్గానికి వెళ్లే సరిహద్దులు నాలుగు మూలల వద్ద నగదు,మద్యం నియంత్రణకు ఇప్పటి వరకు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు.

ప్రతి చెక్‌పోస్టుకు మూడు బృందాలు నిరంతరం గస్తీ ఉండేలా ఒక్కోదానికి 12 మంది సిబ్బందిని నియమించారు.వీరికి అదనంగా ఐదుగురు కేంద్ర రిజర్వు బలగాలను సైతం నియమించారు.

ఎన్నికల భద్రతా ఏర్పాట్ల నిమిత్తం ఎనిమిది కంపెనీల కేంద్ర రిజర్వు బలగాలు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పది రోజుల క్రితమే చేరుకున్నాయి.గతంలో మండల కేంద్రాల్లో పోలీసులు బలగాలు బస చేసి ఆ మండలాల పరిధిలో ఘటనలు జరిగినప్పుడు అక్కడికి చేరుకునేవి.

దీంతో ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగేవి.ఇప్పుడు అలా కాకుండా క్లస్టర్లను ఏర్పాటు చేసి పోలీసులను క్షేత్రస్థాయిలోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

దీంతో గ్రామాల్లో పోలీసులు ఉండటంతో గొడవలు నియంత్రణలో ఉంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండంతో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube