YSRCPలో IPAC జోక్యం ఎక్కువగా పెరిపోవడంతో వైసీపీ నేతలు కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం.సంస్థాగత అంశాలపై IPAC ప్రమేయం ఎక్కువైందట.
ముఖ్యంగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైజాగ్‌లో నిర్వహించిన బీసీ సమ్మేళనం తర్వాత పలువురు వైఎస్సార్సీపీ నేతలకు కలుగుతున్న సందేహం ఇదే.అదేవిధంగా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఐపాక్ బృందం అంగీకరించిన వారినే ఆహ్వానించట.
ఈ రెండు సంఘటనలు YSRCPలో IPAC ఏ విధమైన నియంత్రణను కలిగి ఉన్నాయనే దానిపై తీవ్ర చర్చకు దారితీసింది.ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో పార్టీ నిర్మాణంలో బిజీగా ఉన్నప్పటికీ, అతని సహచరుడు రిషి రాజ్ ఆంధ్రప్రదేశ్‌లో సర్వే బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఐపీఏసీ బృందం వైఎస్సార్‌సీపీలో పూర్తి ఎజెండాను రూపొందిస్తున్నది.రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకూ కార్యక్రమాన్ని ఈ బృందమే పర్యవేక్షిస్తుందట.
2024 ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కూడా ఈ బృందం నిమగ్నమై ఉన్నట్టు సమాచారం.అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితులను తెలుసుకోవడానికి జగన్ పూర్తిగా IPAC పైనే ఆధారపడుతున్నారు.
ఈ కార్యక్రమం అమలుపై ఐపాక్ రోజువారీ నివేదికలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపుతోంది.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి పనితీరు వివరాలను ఈ ఐప్యాక్ టీమ్ ద్వారానే తెలుసుకుంటున్నారు.
ఇక తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ టీంతో ఉన్న ఒప్పందాన్ని కేసీఆర్ కొంతకాలం క్రితం రద్దు చేసుకున్నారు.ఇప్పుడు తెలంగాణలో పార్టీ వ్యూహానికి కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ టీమ్ పీకే సలహాపైనే పూర్తిగా ఆధారపడినట్లు తెలుస్తోంది.అతను ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు IPAC టీమ్ సిఫార్సును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడని తెలుస్తోంది.