కాంతార హీరో రిషబ్ శెట్టి గురించి ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే.రిషబ్ శెట్టి తన టాలెంట్ తో క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఊహించని రేంజ్ లో పెంచుకుంటుండగా ఆయన ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం మాత్రం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.
రిషబ్ శెట్టి తొలి రెమ్యునరేషన్ కేవలం 50 రూపాయలు అంటే ఆయన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో సులువుగానే అర్థమవుతుంది.అప్పులోళ్లకు కనబడకుండా మారు వేషాల్లో తిరిగానని వ్యాపారాలలో నష్టపోయిన సందర్భాలు సైతం ఉన్నాయని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలోని కెరాడి అనే చిన్న ఊరులో నేను జన్మించానని నాన్న జ్యోతిష్కుడు అని రిషబ్ శెట్టి తెలిపారు.హీరో కావాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉండేదని రిషబ్ అన్నారు.
డైరెక్షన్ పై కూడా దృష్టి పెట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరడంతో నాన్న బాగా తిట్టారని రిషబ్ పేర్కొన్నారు.

ఆ తర్వాత సొంతంగా మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం మొదలుపెట్టానని ఆ వ్యాపారంతో కొంత డబ్బు కూడబెట్టానని రిషబ్ శెట్టి వెల్లడించారు.మొదట సైనైడ్ సినిమాకు సహాయ దర్శకుడిగా చేరానని అక్కడ రోజుకు 50 రూపాయలు ఇచ్చారని రిషబ్ అన్నారు.ఆ మూవీ షూటింగ్ ఆగిపోయిందని రిషబ్ చెప్పుకొచ్చారు.2009లో హోటల్ బిజినెస్ పెట్టి 25 లక్షల రూపాయలు నష్టపోయానని రిషబ్ పేర్కొన్నారు.
ఆ తర్వాత సీరియళ్లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని రోజుకు 500 రూపాయలు సంపాదించానని ఆయన చెప్పుకొచ్చారు.
కాంతార మూవీని మా ఊరిలోనే సెట్ వేసి తీశామని రిషబ్ శెట్టి అన్నారు.సినిమాలో నటించిన నటులలో 80 శాతం మా ఊరి వళ్లే అని రిషబ్ శెట్టి అన్నారు.
రిషబ్ శెట్టి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







