టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే సమంత తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై సమంత ఏమాత్రం స్పందించలేదు.
అయితే సమంత మేనేజర్ ఈ వార్తలను కొట్టి పారేశారు అంటూ వార్తలు వచ్చాయి.నిజానికి సమంత భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది.
తాజాగా ఈమె హాస్పిటల్ బెడ్ పై ఉండి చేతికి సెలైన్ పెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ ఫోటోని సమంత షేర్ చేస్తూ ఓ కొటేషన్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ క్రమంలోని తాను గత కొంతకాలం నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ వ్యాధితో బాధపడుతూ తాను చికిత్స తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ఈమె హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తన సమస్యను బయటపెట్టారు.

అయితే డాక్టర్లు తాను త్వరలోనే కోలుకుంటానని చెప్పినట్లు ఈమె వెల్లడించారు.ఇక తన జీవితంలో శారీరకంగా మానసికంగా ఎన్నో మంచి చెడు రోజులు వచ్చాయని తెలియజేశారు.ఇలా ఈమె తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేస్తూ షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే సమంత పోస్టుపై స్పందించినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు తొందరగా సమంత కోలుకొని బయటపడాలంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ విషయం తెలిసిన కొందరు అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







