కృష్ణానదికి విజయవాడలో పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రూ.118.64 కోట్లతో రక్షణగోడ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.ఈ పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని షరతు విధించింది.
టెండర్ షెడ్యూలు దాఖలుకు నవంబర్ 10వ తేదీని గడువుగా నిర్ణయించింది.నవంబర్ 15న ఆర్థిక బిడ్ను తెరిచి.
అదేరోజున రివర్స్ టెండరింగ్ నిర్వహించి, కనిష్ట ధరకు పనులు చేయడానికి ఆసక్తిచూపిన కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తుంది.







