ఖుష్బు ఘాటు వ్యాఖ్యలు.. రాజకీయ నాయకురాళ్లను ‘ఐటెం’ అంటూ!

డీఎంకే నేత సాదైయ్ సాధిక్ బీజేపీ నేతలుగా మారిన నటీమణులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.దీనిపై బీజేపీ నేత, నటి ఖుష్బు సుందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 Khushboos Scathing Comments Called Politicians Items ,khushboo, Dmk, Cm Stalin,-TeluguStop.com

డీఎంకే నేత ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆరోపించారు.తమ పార్టీలో మహిళా నేతలపై ఇలాంటి ఆరోపణలు చేస్తే సైలంట్‌గా ఉంటారా? అని ప్రశ్నించారు.ఈ విషయంలో సీఎం స్టాలిన్ తనకు అండగా నిలబడాలని కోరారు.

బీజేపీలోని ఖుష్బు, నమిత, గౌతమి, గాయత్రి రఘురామ్‌ను ఉద్దేశించి ‘రాజకీయాల్లోకి వచ్చిన ఐటెంలు’ అంటూ సాదైయ్ సాదిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

సాదైయ్ వ్యాఖ్యలపై ఇప్పటికే సొంత పార్టీలోని నేతలే వ్యతిరేకించారు.ఎంపీ కనిమొళి కూడా క్షమాపణ చెప్పారు.దీనిపై ఖుష్బు తీవ్ర స్థాయిలో విమర్శించారు.డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా మహిళా నాయకురాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సాదైయ్ సాదిక్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని ఖుష్బు తెలిపారు.ఈ విషయంలో ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు.

అలాగే ఖుష్బు మహారాష్ట్ర చీఫ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ సుప్రీయ సూలేనుపై చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.ఆమె రాజకీయాలను విడిచిపెట్టి వంట గదికే పరిమితమవ్వాలా? అని ప్రశ్నించారు.ఈ విషయంలో సుప్రీయకు తాను అండగా ఉన్నానంటూ తెలిపారు.మహిళల గౌరవం, పరువు విషయంలో ఎంతదూరమైనా వెళ్లి పోరాడుతామని స్పష్టం చేశారు.

Telugu Actresses, Cm Stalin, Controversy, Gautami, Item, Khushboo, Khushbu, Nami

క్షమాపణ చెప్పిన సాదిక్.

డీఎంకే నేత సాధైయ్ సాదిక్ బీజేపీ నేత ఖుష్బుకి క్షమాపణ చెప్పారు.రాజకీయాల్లో ఉన్న నటీమణులను కించపరిచేలా సాదిక్ మాట్లాడటం.దీనిపై ఖుష్బు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి.తన ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేశారని సాదిక్ వివరణ ఇచ్చారు.అయినా ఖుష్బు, ఇతర నటీమణుల మనసును నొప్పిస్తే క్షమించండంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube