సినిమాలు చేయకున్నా బెంజ్ ఎలా కొన్నావ్ పాప.. బిగ్ బాస్ బ్యూటీ పై కామెంట్స్

బిగ్ బాస్ కి ముందు కొన్ని సినిమా ల్లో నటించడం ద్వారా హమీదా తెలుగు ప్రేక్షకుల్లో కొంత మందికి మాత్రమే తెలుసు.కానీ బిగ్ బాస్ తర్వాత హమీదా చాలా మందికి తెలిసిన సెలబ్రిటీ గా మారింది.

 Biggboss Hamida Car Issue In Social Media , Biggboss Hamida, Film News, Hamida,-TeluguStop.com

సోషల్ మీడియా లో హమీదా కు ఉన్న పాపులారిటీ అంతా కాదు, ఆమె రెగ్యులర్ గా తన అందాల ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ అందరి దృష్టి ని ఆకర్షిస్తూ ఉంది.లక్షల్లో ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ఆమె తాజాగా బెంజ్ కారు ని కొనుగోలు చేసింది.

ఒక వైపు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తూ మరో వైపు ఇంత ఖరీదైన కారు ను హమీదా ఎలా కొనుగోలు చేసింది అంటూ కొందరు కోడి గుడ్డు పై ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆమె ను ఈ సందర్భంగా కొందరు ట్రోల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu Biggboss Hamida, Biggbosshamida, Hamida, Hamida Car, Telugu-Movie

ఆమె కారు కొనుగోలు చేసిన విషయమై అభిమానుల నుండి మద్దతు పొందుతోంది.ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా వస్తున్న ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు.సోషల్ మీడియా లో ఆమె షేర్ చేసే ఫోటో షూట్స్ మరియు ఆమె చేసే సిరీస్ ల కారణంగా మంచి సంపాదన పొందుతుంది.ఆమె అందం మరియు బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీ తో మంచి ఆదాయం దక్కించుకుంటుంది.

ఈ విషయం చాలా మందికి తెలియక ఆమె కు ఆదాయం ఎక్కడిది అంటున్నారు.ఆమె ఆధాయం భారీగానే ఉంది.కనుక ఆమె బెంజ్ కారు కొనడం పెద్ద విషయమేమీ కాదని.దాన్ని రాద్దాంతం చేసేందుకు ప్రయత్నించడం అవివేకం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్బాస్ తో వచ్చిన పాపులారిటీతో చాలా మంది చాలా రకాలుగా సంపాదించుకుంటున్నారు.మరి హామీదానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube