సినిమాలు చేయకున్నా బెంజ్ ఎలా కొన్నావ్ పాప.. బిగ్ బాస్ బ్యూటీ పై కామెంట్స్

బిగ్ బాస్ కి ముందు కొన్ని సినిమా ల్లో నటించడం ద్వారా హమీదా తెలుగు ప్రేక్షకుల్లో కొంత మందికి మాత్రమే తెలుసు.

కానీ బిగ్ బాస్ తర్వాత హమీదా చాలా మందికి తెలిసిన సెలబ్రిటీ గా మారింది.

సోషల్ మీడియా లో హమీదా కు ఉన్న పాపులారిటీ అంతా కాదు, ఆమె రెగ్యులర్ గా తన అందాల ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ అందరి దృష్టి ని ఆకర్షిస్తూ ఉంది.

లక్షల్లో ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ఆమె తాజాగా బెంజ్ కారు ని కొనుగోలు చేసింది.

ఒక వైపు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తూ మరో వైపు ఇంత ఖరీదైన కారు ను హమీదా ఎలా కొనుగోలు చేసింది అంటూ కొందరు కోడి గుడ్డు పై ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆమె ను ఈ సందర్భంగా కొందరు ట్రోల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. """/"/ ఆమె కారు కొనుగోలు చేసిన విషయమై అభిమానుల నుండి మద్దతు పొందుతోంది.

ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా వస్తున్న ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు.సోషల్ మీడియా లో ఆమె షేర్ చేసే ఫోటో షూట్స్ మరియు ఆమె చేసే సిరీస్ ల కారణంగా మంచి సంపాదన పొందుతుంది.

ఆమె అందం మరియు బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీ తో మంచి ఆదాయం దక్కించుకుంటుంది.

ఈ విషయం చాలా మందికి తెలియక ఆమె కు ఆదాయం ఎక్కడిది అంటున్నారు.

ఆమె ఆధాయం భారీగానే ఉంది.కనుక ఆమె బెంజ్ కారు కొనడం పెద్ద విషయమేమీ కాదని.

దాన్ని రాద్దాంతం చేసేందుకు ప్రయత్నించడం అవివేకం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్బాస్ తో వచ్చిన పాపులారిటీతో చాలా మంది చాలా రకాలుగా సంపాదించుకుంటున్నారు.మరి హామీదానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది కదా ఫ్యాన్స్ కోరుకునే ఎమోషన్.. గేమ్ ఛేంజర్ అప్డేట్ ఫుల్ కిక్ ఇచ్చిందిగా!