హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.“కుమారి 21F“తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.పలు సినిమాలతో మంచి గుర్తింపు సాధించింది.తాజాగా “బ్లాక్ అండ్ వైట్” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది.ఎన్ఎల్ వి సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.సందీప్ రెడ్డి, పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.
హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో సూర్య శ్రీనివాస్… బిగ్ బాస్ ఫేమ్ లహరి ఇంకా నవీన్ నేని ముఖ్య పాత్రలో నటిస్తూ ఉన్నారు.తాజాగా ఈ సినిమా టీజర్ నీ రాజ్యసభ సభ్యుడు లెజెండరీ రైటర్ వి.విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేయడం జరిగింది.
రొమాన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో.
.ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
టీజర్ లో నో కమిటీ మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్… లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్” అంటూ హెబ్బా డైలాగ్ చెప్పడం జరిగింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.







