నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ సినిమాలు తక్కువ అనే చెప్పాలి.ఈయన తన కెరీర్ మొత్తం చూసుకుంటే ఒకటి రెండు మినహా మిగతావన్నీ డిజాస్టర్ సినిమాలే.
దీంతో తమ్ముడు ఎన్టీఆర్ లాగా స్టార్ హీరో కాలేక పోయాడు.ఎన్టీఆర్ వరుస హిట్స్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఇతడి కెరీర్ మాత్రం పడిపోయింది.
అయితే ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కించిన ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు.కానీ అనూహ్యంగా ఈ సినిమా అందరిని ఆశ్చర్య పరిచేలా హిట్ అయింది.
ఎఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని కళ్యాణ్ రామ్ ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేస్తున్నాడు.
ప్రెజెంట్ రామ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది.గత ఏడాది లోనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాకు ‘అమిగోస్‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
ఈ సినిమాను రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో చేస్తున్న ఈ సినిమా షూట్ ఇటీవలే పూర్తి అవ్వడంతో ఇప్పుడు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 2న రావడానికి సిద్ధం అయినట్టు టాక్.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపు కుంటున్న ఈ సినిమాను బాబాయ్ బాలయ్యకు అచొచ్చిన తేదీన రిలీజ్ చేయాలనీ కళ్యాణ్ రామ్ తో పాటు మేకర్స్ కూడా భావిస్తున్నారట.ఇదే రోజు వచ్చిన అఖండ సూపర్ హిట్ అయ్యింది.మరి ఇప్పుడు బాబాయ్ అడుగు జాడల్లో అబ్బాయి కూడా అదే డేట్ న రావడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
చూడాలి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో.