నాగ చైతన్య హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం లో కూడా రూపొందుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
తెలుగు మరియు తమిళం లో ఒకే సారి ఈ సినిమా ను విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికం గా ప్రకటించారు.ఇక ఈ సినిమా లో నాగ చైతన్య పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ దర్శకుడు వెంకట్ ప్రభు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాటల తో కచ్చితం గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ నమ్మకం తో ఎదురు చూస్తున్నారు.

పైగా ఈ సినిమా లో బంగారు రాజు సినిమా కోసం నాగ చైతన్య తో రొమాన్స్ చేసిన కృత్తి శెట్టి హీరోయిన్ గా నటించడం వల్ల కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకం తో అక్కినేని ఫ్యాన్స్ ధీమా ని వ్యక్తం చేస్తున్నారు.నాగ చైతన్య మరియు కృతి శెట్టి కాంబినేషన్ సన్నివేశాలు బంగారు రాజు లో సూపర్ హిట్ అయ్యాయి. నాగార్జున ఉండడం వల్ల వారిద్దరి కాంబో గురించి ఎక్కువగా చర్చ జరగలేదు, కానీ ఈ సినిమా తో వారిద్దరి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుందని.
ఇద్దరి కాంబో లో సినిమా అద్భుతంగా ఉంటుందని మరో సారి బంగార్రాజు సినిమా తరహా లో హిట్ కొట్టడం ఖాయం అంటూ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా నమ్మకం తో మాట్లాడుకుంటున్నారు.వచ్చే సంవత్సరం సమ్మర్ కానుక గా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.