సమంత లీడ్ లో దర్శక ద్వయం హరి అండ్ హరీష్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా యశోద.శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నుంచి లెతెస్ట్ గా ట్రైలర్ రిలీజైంది.
ఈ ట్రైలర్ చూస్తే సమంత మరికొంతమంది సరోగసీ విధానంలో పిల్లలని కనడానికి వస్తారు.వారికి అలా కనడం వల్ల డబ్బుని ఇస్తారు.
కానీ కేవలం పిల్లలని కనడమే కాకుండా దాని వెనక ఓ పెద్ద స్కాం ఉంటుందని యశోదకి అర్ధమవుతుంది.ఇంతకీ ఆ స్కాం ఏంటి దాని నుంచి సమంత ఎలా బయట పడ్డది.
తనకు ఎదురైన ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆమె ఎలా బయట పడ్డది అన్నది సినిమా కథ.
సమంత యశోద పాత్రలో మరోసారి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మెప్పించిందని చెప్పొచ్చు.హరి అండ్ హరీష్ దర్శకులు తమ మొదటి సినిమానే కానీ సినిమాని చాలా తీసినట్టు అనిపిస్తుంది.నవంబర్ 11న యశోద ప్రేక్షకుల ముందుకు వస్తుంది.సినిమాలో దేవ్ మోహన్ మేల్ లీడ్ గా నటిస్తున్నాడు.వీరిద్దరు కలిసి శాకుంతలం సినిమాలో కూడా నటించారు.
మొత్తానికి యశోద ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసింది.ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.