డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిన్న రహస్యంగా ఏపీ సీఎం జగన్ తో సమావేశాలు అయినట్లు వార్తలు వచ్చాయి.లంచ్ సమయంలో వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు అనేక అంశాల మీద చర్చ జరిగిందట.
ఇదిలా ఉంటే నిన్న జగన్ తో భేటీ అయిన రాంగోపాల్ వర్మ నేడు ట్విట్టర్ ద్వారా పొలిటికల్ నేపథ్యంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటన చేశారు.ట్విట్టర్ లో ఆర్జీవి పెట్టిన పోస్ట్…”అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది.
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .మొదటి పార్ట్ “వ్యూహం” , 2nd పార్ట్ “శపథం” .రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది.

వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు”.అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టడం జరిగింది.
దీంతో ఆర్జీవి పెట్టిన పోస్ట్ అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది.







