తమిళనాడులోని కోయంబత్తూర్ లో జరిగిన కారు బాంబు ఘటనపై సీఎం స్టాలిన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.
అదేవిధంగా ఎన్ఐఏతో విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్ సూచించారు.శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని పేర్కొన్నారు.
అసాంఘిక చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు కోయంబత్తూరులో కారు బాంబు పేలుడుతో హైఅలర్ట్ కొనసాగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.సిటీలో అనుమానాస్పదంగా ఉన్న 12 కార్లను గుర్తించారు.
కార్ల యజమానులు ఎవరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.ప్రధాన కూడళ్లలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.







