పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.భారీ బడ్జెట్ తో పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది.
ఇప్పటికే రామాయణ ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కిన ఇది 3డి వర్షన్ లో తెరకెక్కుతుండటం విశేషం.ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా అప్పటి నుండి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.
లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించగా.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.

అయితే ముందుగానే ప్రొమోషన్స్ చేస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మరింత హైప్ రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని.ఓం రౌత్ ఆశ్చర్యపోయే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని.
చెప్పుకొచ్చాడు.ఇతడు హిందీలో ప్రభాస్ సినిమాలకు డబ్బింగ్ చెబుతూ ఉంటారు.
ఇక ఆదిపురుష్ లో కూడా ప్రభాస్ కు ఇతడే డబ్బింగ్ చెప్పాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శరద్ కేల్కర్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలిపాడు.
ఈ సినిమాకు సంబందించిన సీన్స్ కొన్ని చూశానని.ఎంతో బాగా వచ్చాయని.
డబ్బింగ్ ఇంకా చెప్పలేదని.ఆదిపురుష్ అద్భుతంగా ఉందని తెలిపారు.
ఓం రౌత్ కు సినిమాలపై ఎంతో జ్ఞానం ఉంటుందని.ఆయనను నమ్మండి.
మీరు ఆశ్చర్యపోయే సినిమాను అందిస్తారని చెప్పుకొచ్చాడు.







