విడాకులు తీసుకోవడానికి అసలు కారణం చెప్పిన ప్రగతి.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి,క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రగతి టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

 Pragathi Open Up Marriage And Divorce Emotionally Said That About Her Financial-TeluguStop.com

ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు తన ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

ఇక సోషల్ మీడియాలో తన ఫొటోస్ వీడియోస్ పై, తన ఏజ్ విషయంపై కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో గాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది ప్రగతి.

నాలుగు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది ప్రగతి.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రగతి పేరు మారుమోగిపోతుంది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ లో షూటింగులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి తన వద్ద ఉన్న నగలను తాకట్టు పెట్టి అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడినట్లు ఆమె తెలిపింది.

Telugu Divorce, Pragathi, Tollywood-Movie

అలాగే తన పెళ్లి విడాకులపై స్పందించిన ప్రగతి తాను హీరోయిన్గా చేసే సమయంలో ఒక రైన్ సాంగ్లు ట్రాన్స్ పరెంట్ సారీ ధరించాల్సి ఉందట.కానీ నచ్చక ఆమె సినిమా నుంచి తప్పుకొని పెళ్లి చేసుకుందట.ఆమెకు ఒక కుమారుడు కూతురు కూడా పుట్టారు అని తెలిపింది ప్రగతి.ఆ తర్వాత తన భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నట్లు ప్రగతి చెప్పుకొచ్చింది.

పెళ్లి లైఫ్ ను సాఫీగా సాగించేందుకు చాలా కష్టపడ్డాను కానీ కుదరలేదు దాంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది ప్రగతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube