ఆచార్య సినిమా కు భారీ బజ్ వచ్చింది కదా అని వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం జరిగింది.సినిమా ను మరింత హైప్ చేసి ప్రమోట్ చేయడం జరిగింది.
ఇంత చేస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.దాంతో బయ్యర్లు గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
తద్వారా సినిమా యొక్క పాపులారిటీ మరింతగా తగ్గి రావాల్సిన కలెక్షన్స్ కూడా రాలేదు.
దాంతో భారీ ఎత్తున సినిమా నష్టాలను చవి చూసిందని.
నిర్మాతలు పెద్ద మొత్తంలో బయ్యర్లకు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు.ఆచార్య సినిమా కు భారీ గా హైప్ తీసుకు రావడం వల్ల.
భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం వల్ల తప్పు జరిగిందని భావించిన మెగా కాంపౌండ్ గాడ్ ఫాదర్ కి పెద్దగా ప్రమోషన్ చేయలేదు.అలాగే వంద కోట్ల లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేలా చేయడంతో పాటు చాలా చోట్ల సినిమా ను సొంతం గా రిలీజ్ చేయడం జరిగింది.

తద్వారా సినిమా యొక్క టాక్ యావరేజ్ అయినా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.అంతే కాకుండా బ్రేక్ ఈవెన్ చాలా ఈజీగా జరిగిందట.అందుకే గాడ్ ఫాదర్ కి అనుసరించిన విధంగానే వాల్తేరు వీరయ్య సినిమా కి కూడా అనుసరించే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ను 80 కోట్లకు కాస్త అటు ఇటుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే ఉద్దేశ్యంతో చిరంజీవి అండ్ టీమ్ ఉన్నారట.
ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి.కనుక ఈజీగా వంద కోట్ల బిజినెస్ చేయవచ్చు.కానీ అంత భారీగా బిజినెస్ చేయాలని మేకర్స్ అనుకోవడం లేదట.
సినిమా విడుదల అయిన తర్వాత మాత్రమే లాభాలను ఆశిస్తున్నామని నిర్మాతలు అంటున్నారు.