ఇంటిమీదే వ్యవసాయం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.నేడు మారిపోతున్న కాలనుపరిస్థితుల వలన వ్యవసాయం రూపమే మారిపోతుంది అనడమే సందేహం లేదు.
భారత్ సహా ఇతర దేశాలు బేసిగ్గా వ్యవసాయ ఆధారిత దేశాలు.అధిక శాతం జనాభా ఇక్కడ ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతూ వుంటారు.
అయితే ఏళ్లు గడిచే కొద్దీ ఇక్కడ వ్యవసాయానికి అనేది సాయం లేక డీలా పడిపోతూ వస్తోంది.దీంతో వ్యవసాయ భూములు కనుమరుగవుతూ వస్తున్నాయి.
మరోవైపు అనేకమంది ఇపుడు రసాయనాల ద్వారా పంటలు పండిస్తూ, భూ సారాన్ని తగ్గించేస్తున్నారు.
దాంతో ప్రజల ఆరోగ్యం నానాటికీ క్షీణించి పోతోంది.
అందుకే కొందరు ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, మార్కెట్లోకి తెచ్చి మంచి డబ్బులు చేసుకుంటున్నారు.అందుకే వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది.
ఈ క్రమంలో ఓ వ్యక్తి తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు.దాంతో అతగాడు ఏడాదికి దాదాపుగా 70 లక్షల సంపాదిస్తూ అందరికీ రోల్ మోడల్ అవుతున్నాడు.
అతనే ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు.
గతంలో జర్నలిస్ట్ గా పని చేసిన ఈయన.తనకున్న పరిజ్ఞానం, వనరులతో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా, వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ అనే స్టార్టప్ ని ప్రారంభించి హైడ్రోపోనిక్ పద్దతిని తెలుసుకున్నాడు.
ఆ తరువాత తన ఇంటిపై ఉన 3 అంతస్తులను వ్యవసాయ క్షేత్రంగా మార్చివేసాడు.ఈ పద్ధతితో మట్టి పెద్దగా అవసరం లేకుండా, 90% నీటిని పొదుపు చేస్తూ రసాయనాలు కూడా వాడకుండా కేవలం పీవీసీ పైపుల సహాయంతో అతని బాల్కనీలో పంటలు పండిస్తున్నాడు.