గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో ట్రెండ్ అయినటువంటి వారిలో నయనతార దంపతులు ఒకరు.ఈ జంట గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వీరి పెళ్లి జరిగిన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది.అయితే ఈ దంపతులు చట్ట విరుద్ధంగా సరోగసి ద్వారా పిల్లలను కన్నారంటూ వీరి గురించి విమర్శలు రావడంతో ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా వీరిపై చర్యలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ఆరు సంవత్సరాల క్రితమే వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకున్నారని చట్టపరంగానే సరోగసి ద్వారా పిల్లలను కన్నామని ఆధారాలను సమర్పించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.ఇకపోతే ఈ వివాదం ముగిసిన అనంతరం నయనతార విగ్నేష్ దంపతులు మొదటిసారిగా తన పిల్లలతో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులను ధరించిన ఈ దంపతులు తమ పిల్లలను ఎత్తుకొని వారి మొహాలు కనపడకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ క్రమంలోనే ఈ దంపతులు అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వీడియోని విగ్నేష్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలి.జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడాలి.
ప్రేమ జీవితానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.ప్రేమలో ఎప్పుడు నమ్మకంగా ఉండాలి అంటూ ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.