దీపావళి సందర్భంగా సంక్రాంతిని మరింత టైట్‌ చేశారు బాబోయ్‌

నేడు దీపావళి సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ మరియు వీడియోలను విడుదల చేయడం జరిగింది.దీపావళి సందర్భంగా విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్స్ సంక్రాంతి సీజన్ సినిమాల జోరు మరింత రచ్చ రచ్చగా ఉండబోతుందని తేల్చి చెప్పాయి.

 Sankranthi 2023 Movies List Going To Very Big , Flim News, Mega154, Sankranthi 2-TeluguStop.com

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కన్ఫర్మ్ అయింది.నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయింది.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ ఆది పురుష్‌ సినిమా కూడా సంక్రాంతికి ఉంది అంటూ ప్రచారం జరిగింది, కానీ సంక్రాంతికి ఆ సినిమా ఉండే అవకాశం లేదని కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

Telugu Sankranthi-Movie

ఆ విషయం పక్కన పెడితే అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.దీపావళి సందర్భంగా నేడు విడుదల చేసిన పోస్టర్ లో ఆ విషయాన్ని కన్ఫమ్ చేశారు.సంక్రాంతికి ఏజెంట్ రంగంలోకి దిగబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అంతే కాకుండా దీపావళి సందర్భం గా విడుదలైన సూపర్ స్టార్ విజయ్ దిల్ రాజు కాంబో తెలుగు సినిమా పోస్టర్ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా కన్ఫర్మ్ అయింది.మొత్తానికి దీపావళి రోజు సంక్రాంతి పోటీ మరింతగా పెరిగింది, ఆ పోటీలో నిలిచేది ఎవరు అనే విషయం మరో నెల రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎవరు వెనక్కి తగ్గిన తగ్గకున్నా సంక్రాంతి కి మాత్రం కచ్చితం గా భారీ పోటీ ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube