తన సమస్య గురించి చెప్పడానికి వచ్చిన మహిళను కొట్టిన మంత్రి... కాళ్లకు దండం వీడియో వైరల్..

ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఎన్నికలలో విజయం సాధించడానికి ఎక్కువగా పాదయాత్రలు చేస్తున్నారు.ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తూ ఎన్నికలలో గెలవడానికి ఏమి చేయడానికి అయినా మేము సిద్ధమే అనే భరోసాను చూపిస్తూ ఉంటారు.

 The Video Of The Minister Beating The Woman Who Came To Tell About Her Problem I-TeluguStop.com

కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ప్రజలను ఏలా పడితే అలా మాట్లాడడం, మరికొంతమంది అయితే కొట్టడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రం లో జరిగింది.

కర్ణాటక రాష్ట్ర మంత్రి ఒక మహిళతో దురుసుగా ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకున్నాడు.

తనకు భూమి కేటాయించలేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను మంత్రి సోమన్న చెంప దెబ్బ కొట్టారు.

ఈ సంఘటన శనివారం రోజు జరగడంతో విపక్షాలు మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.చామరాజ్‌నగర్ జిల్లా హంగాల గ్రామంలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి కర్ణాటక మౌలిక వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వీ.సోమన్న ముఖ్య అతిథిగా వచ్చారు.ఈ కార్యక్రమంలో 175 మందికి గ్రామీణ ప్రాంతాల్లో భూ క్రమబద్దీకరణకు ఉద్దేశించిన సెక్షన్ 94సీ ప్రకారం టైటిల్ డీడ్‌లను అందించారు.

అలాగే ఒక మహిళ కూడా తనకు రెవెన్యూ శాఖ పట్టాను ఇవ్వలేదని దరఖాస్తు చేసుకుంది.దీనిపై ఆమె అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.ఈ క్రమంలో మంత్రి వద్దకు వెళ్లగానే ఆయన ఆమెను చెంప మీద కొట్టారు.

వెంటనే అక్కడేవున్న మహిళ మంత్రి కాళ్లకు దండం పెట్టి,ఆమె సమస్యను మంత్రిగారికి చెప్పింది.

అయితే ఆ తర్వాత మంత్రిగారు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం.

అయితే మంత్రి సోమన్న వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అన్ని డిమాండ్ చేస్తున్నాయి.మహిళలను గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ బిజెపి నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు మంత్రి పదవి నుండి సోమన్నను వెంటనే తొలగించాలనీ కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube