స్పామ్ కాల్స్ ఇబ్బందిపెడుతున్నాయా? ఒక్క దెబ్బతో బ్లాక్ చేసి పడేయొచ్చు!

మనలో అనేకమందికి స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి.ఇక వాటిని ఎలా అవాయిడ్ చేయాలో వారికి తెలియదు.ఫోన్ లిఫ్ట్ చేసిన తరువాత నిరుత్సాహపడిపోతూ వుంటారు.ఇంకా ఈ కాల్స్ బాగా డిస్టర్బ్ చేస్తాయి కూడా.ముందే ఇలాంటివి అవాయిడ్ చేస్తే బావుంటుంది.లేకపోతే మళ్లీమళ్లీ ఇలాంటి కాల్స్ వేధిస్తూ ఉంటాయి.

 Are Spam Calls Bothering You? You Can Block It With One Blow , Spam Calls, Sett-TeluguStop.com

అయితే స్పామ్ కాల్స్ లో సుమారుగా 3 రకాల స్కామ్ కాల్స్ వున్నాయి.అందులో మొదటిది టెలిమార్కెటింగ్ కాల్స్, రెండవది రోబో కాల్స్, ఆఖరిగా మూడవది ఉత్త స్కామ్ కాల్స్.

ఈ మూడు రకాల కాల్స్ ఒకోసారి చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి.

ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువగా ప్రజలు ఫోన్‌లపై గడిపేవారు.

దానివలన ఈ స్పామ్ కాల్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి.అలాంటి స్పామ్ కాల్స్ ని పూర్తిగా వదిలించుకోవాలనుకుంటే, ఒక మార్గం ఉంది.

అవును, గూగుల్ అండ్రాయిడ్ యూజర్ల కోసం స్పామ్ కాల్స్ నుండి రక్షించే రెండు ఫీచర్స్ అందిస్తుంది.ఈ ఫీచర్స్ కాలర్ ఐ‌డి మరియు స్పామ్ ప్రొటెక్షన్.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డిఫాల్ట్‌గా ఈ రెండు ఫీచర్లు ఆన్ చేసి ఉంటాయి, వీటిని యూజర్లు ఎప్పుడైనా ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.ఈ స్పామ్ కాల్స్ పర్మనెంట్ గా బ్లాక్ చేయడం ఎలాగో ఇక్కడ చూడండి.

Telugu Latest, Spam, Ups-Latest News - Telugu

1: మీ అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని కాల్ యాప్‌ని ఓపెన్ చేసి పైన రైట్ సైడ్ లో వున్న ఉన్న మూడు చుక్కలపై మొదట క్లిక్ చేయండి.

2: ఆ తరువాత సెటింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి.

3: తరువాత స్పామ్ అండ్ కాల్ స్క్రీన్ ఆప్షన్ పై నొక్కాలి.

4: సీ కాలర్ & స్పామ్ ఐడి ఆప్షన్ ఆఫ్ చేసివుంటే ఆన్ చేయండి.

ఈ ఆప్షన్స్ మీకు పని చేయకపోతే అండ్రాయిడ్ యూజర్లు కాల్స్ స్పామ్‌గా గుర్తించవచ్చు.అయితే కొన్ని సెట్టింగ్‌లను మార్చడం ద్వారా వాటిని మాన్యువల్‌గా కూడా బ్లాక్ చేయవచ్చు.దానికి ఇవి ఫాలో అవ్వండి.

1: అండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని తెరిచి రీసెంట్ ట్యాబ్‌పై నొక్కండి.

2: ఇప్పుడు మీరు స్పామ్‌గా రిపోర్ట్ చేయాలనుకుంటున్న కాల్‌పై క్లిక్ చేయండి.

4: తరువాత బ్లాక్ లేదా రిపోర్ట్ స్పామ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube