అదేంటో కానీ.కొందరు దర్శక నిర్మాతలు మంచి హీరోలను వదిలేసి.
ఫ్లాప్ అయిన హీరోల వెంట పడుతుంటారు.మరి అది వారసత్వంగా వచ్చిన హీరోలు అనో లేదా మరేదైనా కారణమో కానీ ఆ హీరోలకి అవకాశాలు ఇస్తూ ఉంటారు కొందరు దర్శకనిర్మాతలు.
ఒకవైపు స్టార్ హీరోలు దూసుకెళ్తుంటే మరోవైపు ఒక్క సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న హీరోలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.కానీ ఖాతాలో వరుసగా ఫ్లాప్స్ అందుకున్న హీరోలను మాత్రం బాగా పట్టించుకుంటారు.
అదేంటో మరి.ఎందుకు వాళ్ల వెంట పడుతున్నారో అర్ధం కావట్లేదు.ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఓ ముగ్గురి హీరోల వెంట బాగా పడుతున్నారు దర్శక నిర్మాతలు.ఇంతకు ఆ హీరోలు ఎవరో కాదు. శ్రీ విష్ణు, ఆది, కిరణ్ అబ్బవరం.టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందినశ్రీ విష్ణు గురించి అందరికీ పరిచయమే.తొలిసారిగా బాణం సినిమాతో పరిచయం అయ్యాడు.ఆ తర్వాత సోలో సినిమాలో కూడా నటించాడు.అలా పలు సినిమాలలో నటించగా అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోయాడు.
కానీ ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.ఈ ఏడాది కూడా మరో సినిమాతో రాగా ఆ సినిమా కూడా అంత సక్సెస్ కాలేకపోయింది.
వరుసగా ప్లాప్స్ అందుకున్న కూడా శ్రీ విష్ణు కి బాగా అవకాశాలిస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో హీరో ఆది సాయికుమార్.ప్రముఖ తెలుగు నటుడు సాయికుమార్ కుమారుడు ఆది.మొదటిసారిగా ప్రేమకావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆది ఈ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత లవ్ లీ, సుకుమారుడు వంటి సినిమాల్లో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా విజయం సొంతం చేసుకోలేకపోయాడు.

అయినా కూడా ఆయనకు ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఏకంగా 10 సినిమాలలో వరుసగా ఫ్లాప్ లు సొంతం చేసుకున్నాడు ఆది.కానీ ఇప్పటికి ఆయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.ఇక మరో హీరో కిరణ్ అబ్బవరం గురించి అందరికీ తెలిసిందే.
ఇక ఈయన కూడా చిన్న హీరోనే కానీ ఈయనకు వరుసపెట్టి అవకాశాలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు.కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందించినప్పటికీ కూడా అంతగాగుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు.
అయినా కూడా ఈయనకు మాత్రం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.ఈ ఏడాది కూడా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఈ ముగ్గురు హీరోలను మాత్రం దర్శక నిర్మాతలు అస్సలు వదలట్లేదు అని చెప్పవచ్చు.







