ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ పాటించే వారు చాలా తక్కువనే చెప్పవచ్చు.ఎలాంటి ట్రాఫిక్ సైన్‌లు కూడా చూపించకుండా టర్నింగ్స్ తీసుకోవడం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా యమ స్పీడ్ గా వెళ్లడం కారు, బైక్ వాహనదారులకు బాగా అలవాటు అయింది.
కొందరు బైకర్లు అయితే ఏకంగా అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ రోడ్లపై చేస్తూ ఇతరుల ప్రాణాలకు కూడా హాని తలపెడుతున్నారు.ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
కాగా తాజాగా ఒక వ్యక్తి బైక్‌పై అదిరిపోయే స్టంట్స్ చేశాడు.సీన్ కట్ చేస్తే అతడి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది.
అతడు చేసిన స్టంట్స్‌కి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాల్లోకి వెళితే.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన జిష్ణు అనే ఓ రైడర్ తన బైక్‌తో అత్యంత రిస్కీ స్టంట్స్ చేశాడు.ఇతడు స్టంట్స్ చేయడంలో చాలా నేర్పరి.
స్టంట్స్ చేయడంలో దిట్ట అయినా కూడా వీటిని పబ్లిక్ రోడ్డులపై కాకుండా కేవలం ట్రాక్‌పై ట్రై చేయాలి.ఎందుకంటే ఏదైనా తేడా జరిగినా అవతలి వ్యక్తికి ఎలాంటి హాని జరగదు.
పోలీసులు కూడా ఇదే రూల్ పాటించాలని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు.గతంలో కూడా జిష్ణు పబ్లిక్ రోడ్డ్‌పై స్టంట్స్ చేస్తూ పోలీసులకు చిక్కాడు.
అప్పటికి అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.మళ్లీ ఇప్పుడు అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.
దాంతో పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అలాగే ఆర్‌సీ కూడా రద్దు చేశారు.అంతేకాకుండా ఆ యువకుడికి షాకిస్తూ ఆ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అతడి బైక్‌ని ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లడం కూడా ఒక వీడియోలో కనిపించింది.
వైరల్ వీడియోలో జిష్ణు అనేక చోట్ల స్టంట్స్ చేస్తూ ఉండటం చూడవచ్చు.ఈ వీడియోను ఈ స్టంట్స్ చేసిన జిష్ణు కూడా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు.
@jishnu_stunts ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వేదికగా అతడు షేర్ చేసిన ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







