బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫోన్ బూత్.ఈ సినిమాలో కత్రినా కైఫ్ దెయ్యం పాత లో కనిపించనుంది.
నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతోంది కత్రినా కైఫ్.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ నేపథ్యంలోనే తన కెరీర్ లో ఆరంభంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
నాకు తెలియదు ఆరంభంలో ఒక చేదు సంఘటన నాకు ఎదురయింది.2003లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి సినిమాలో ఒక టేక్ తర్వాత సినిమా నుంచి తరంగా తీసేసారు.అయితే ఎందుకు తీసేసారు అన్నది కారణం స్పష్టంగా చెప్పలేదు.
కానీ డైరెక్టర్ కోపంతో ప్రొడ్యూసర్ వైపు చూసి వెంటనే ఆ సినిమా నుంచి కత్రినా ని తీసేయ్ అని అన్నారు.దాంతో నా కెరియర్ ముగిసిపోయింది అని నేను అప్పుడు చాలా భయపడిపోయాను అని కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది.
కాగా ఆ సినిమా పేరు సాయ.అందులో జాన్ అబ్రహం హీరోగా నటించారు.

అయితే ఆమె మీద కోప్పడిన దర్శకుడు మరెవరో కాదు అనురాగ్ బసు.అతను చెప్పగానే వెంటనే ప్రొడ్యూసర్ ఆ సినిమా నుంచి కత్రినాను తప్పించాడట.అయినప్పటికీ కత్రినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేసి వరుసగా సినిమాలో నటించి దూసుకుపోయింది.ఆ సినిమా చేజారినప్పటికీ కత్రినా కైఫ్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకుంది.
అలా ఆమె సినీ ఇండస్ట్రీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తూనే ఉంది.ఇప్పటికీ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది కత్రినా కైఫ్.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఈమె పెళ్లి అయిన తర్వాత కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.







