టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతిభతో ఎంతోమందిని మెప్పించారు.
ప్రస్తుతం తారక్ జపాన్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ జపాన్ కు వెళ్లడం జరిగింది.అయితే తారక్ అక్కడ జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
టోక్యో వీధులలో ఆర్ఆర్ఆర్ టీమ్ దోస్తీ పాటకు డ్యాన్స్ చేస్తూ రోడ్డు దాటడం గమనార్హం.
జపాన్ భాషలో తారక్ మాట్లాడారంటే తారక్ రియల్లీ గ్రేట్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఫ్యాన్స్ ను జపాన్ భాషలో మాట్లాడటం ద్వారా తారక్ మెప్పించారు.
ఆర్.ఆర్.ఆర్ సినిమాకు తారక్ ఊహించని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుండటం గమనార్హం.
జపాన్ భాషలో తారక్ మాట్లాడిన వీడియోను చూసిన నెటిజన్లు తారక్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ జపాన్ లో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.జపాన్ భాషలో ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం ఖాయమని నమ్ముతున్నారు.తారక్ తన భార్యతో దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తారక్ లక్ష్మీ ప్రణతి జోడీ బాగుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.