పుట్టింది గోల్డెన్ స్పూన్ తో.అందుకే రాజమార్గంలో హీరో అయిపోయాడు జగపతి బాబు.
కానీ సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి ఎర్ర తివాచి కాదు కదా.అక్కడ పూలు మాత్రమే వేస్తారు అనుకంటె పొరపాటే.తగిలే ముల్లులు, కుచ్చుకునే రాళ్ళూ చాలానే ఉంటాయి.అందుకే జగపతి బాబు ఎప్పుడు సగం సక్సెస్ ని మాత్రమే జేబులో పెట్టుకొని చాల ఏళ్ళు ఇండస్ట్రీ ల ప్రయాణం చేసాడు.
ఎందుకో ఆయనలో హీరోను మెచ్చుకొని సినీ ప్రేమికుడు విలన్ గా మాత్రం పట్టాభిషేకం చేసాడు.మరి అయన సినిమాల్లో హీరోగా ఎక్కువగా జనాలని ఇంప్రెస్స్ చేసిన పాత్రలు ఎన్ని ఉన్నాయి అంటే వేళ్ళ మీద లెక్క పెట్టె పాత్రలు మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గాయం సినిమా గురించి ఇక్కడ తప్పకుండ చెప్పుకోవాలి.రేవతి సినిమాలో ఎక్కువ వెయిట్ ని మోసిన జగపతి బాబు కి కూడా ఈ చిత్రం కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ అని చెప్పవచ్చు.
సీరియస్ గా కలిపించిన కూడా జనాలను బాగానే కనెక్ట్ చేసాడు.కానీ ఈ సినిమా విజయంలో ఎక్కువ భాగం రేవతి తీసుకోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ ప్రతిభ కారణంగానే మరింత హిట్ అయ్యిందని చెప్పుకోవాలి.
మరి జగపతి బాబు లోని మంచి నటుడిని తీసుకచ్చిన సినిమా గాయం కాకుండా ఏదైనా వుంది అంటే అది కేవలం సారాయి వీర్రాజు పాత్ర.
సౌందర్య, సాయి కుమార్ లీడ్ రోల్ లో నటించిన అంతఃపురం సినిమాలో జగపతి బాబు కనిపించేది కాసేపే.అయినా కూడా ప్రేక్షకుడు అతడితో పాటె ట్రావెల్ అవుతారు.అతడు చనిపోతే జనాలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతలా జగపతి బాబు ఈ సినిమాలో తన నటనతో, ఎమోషన్ తో పరిపూర్ణ నటుడిగా అవతారం ఎత్తాడు.ఇక దొంగాట సినిమాలో కూడా జగపతి బాబు భలే ఆక్ట్ చేసాడు.
కానీ అయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం సారాయి వీర్రాజు మాత్రమే.ఇక విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతగా జనాలను మెప్పించింది మాత్రం శ్రీమంతుడు సినిమా.