స్టార్ హీరో బాలకృష్ణ ఎనర్జీ లెవెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంత రిస్కీ షాట్ అయినా బాలయ్య సులువుగా చేసేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అన్ స్టాపబుల్ సీజన్2 సెకండ్ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ ఎపిసోడ్ కు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ గెస్ట్ లుగా హాజరయ్యారు.విశ్వక్ సేన్ బుద్ధిమంతుడు అని బాలయ్య అనగా అస్సలు కాదని సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు.
ఫ్లర్టింగ్ కు టిప్స్ ఇవ్వాలని బాలయ్య అడగగా సిద్ధు టిప్స్ ఇచ్చారు.సరదాగా ఒకమ్మాయికి ఫోన్ చేద్దామని బాలయ్య అడగగా సిద్ధు జొన్నలగడ్డ ఒక అమ్మాయికి ఫోన్ చేశారు.
బాలయ్య ఆ అమ్మాయితో నేను సిద్ధును మాట్లాడుతున్నానని చెప్పగా నువ్వు సిద్ధు కాదు అని ఆమె చెప్పారు. బాలయ్య మళ్లీ సిద్ధునే అని చెప్పగా ఆ అమ్మాయి బాలయ్య సార్ మీరు అని చెప్పారు.
నీతో సిద్ధు ఫ్లర్ట్ చేయమని చెప్పాడని బాలయ్య చెప్పగా నేనేం చెప్పలేదు రాధిక అని సిద్ధు కామెంట్ చేశారు.
ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికెళ్లినా జై బాలయ్య అని వినిపిస్తుందని చెప్పగా బాలయ్య “అందరూ నా పేరు చెప్పుకుని అమ్మాయిలకు లైన్లు వేస్తున్నారని నాకు అమ్మాయిలెవరూ పడట్లేదు ” అని కామెంట్ చేశారు.
నేను గొంతు విని మొహం ఊహించగలనని నువ్వు చందమామలా ఉంటావని బాలయ్య చెప్పుకొచ్చారు.బాలయ్య బాబు సైక్లోన్ అని అమ్మాయి కామెంట్ చేయగా సైక్లోన్ కాదు సునామీ అని బాలయ్య వెల్లడించారు.
బాలయ్యతో మాట్లాడిన అమ్మాయి పేరు అనుపమ కాగా మనిద్దరం డిన్నర్ కు వెళదామని బాలయ్య పేర్కొన్నారు.ఫ్యాన్స్ కోరిక మేరకు బాలకృష్ణ మూన్ వాక్ చేస్తూ పాట పాడుతూ స్టెప్పులు వేశారు.బాలయ్య వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.నా సంపాదన కంటే అభిమానులే ముఖ్యమని బాలయ్య తెలిపారు.