కోలీవుడ్ క్యూట్ జంట హీరో సూర్య, భార్య జ్యోతిక ల గురించి మనందరికీ తెలిసిందే.సూర్య భార్య జ్యోతి కూడా హీరోయిన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.
వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించారు.ఇక జ్యోతిక తన అందం అభినయం నటనతో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.
ఇక సూర్య అనే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు బిడ్డల జన్మించడంతో పూర్తిగా వారి బాధ్యతలను కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ సినిమాలకు దూరం అయింది.అయితే పిల్లలు ఇంకా పెద్దవారు కాకముందే అప్పుడే నిర్మాతగా నటిగా కూడా ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక.
ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.ఇకపోతే జ్యోతిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది.దాంతో అందరూ జ్యోతిక గురించే చర్చించుకుంటున్నారు.ఈ వయసులో ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా జ్యోతిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తూ జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ కనిపించడంతో అది చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.కాగా అందుకు సంబంధించిన వీడియో ని పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది జ్యోతిక.
నా పుట్టినరోజు కూడా ఆరోగ్యాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నాను.మా కోచ్ మహేష్ కు నాకు ఫంక్షనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు.నా వయసు నన్ను మార్చకముందే నా వయస్సును నేను మారుస్తున్నాను అని రాసుకొచ్చింది జ్యోతిక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం జ్యోతికా పలు సినిమాలలో నటిస్తూనే మరికొన్ని ప్రాజెక్టులకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.
తాజాగా జ్యోతిక షేర్ చేసిన వీడియో పై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం అవసరమా అన్నట్టుగా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.