టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ వసూళ్ల ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా హాలీవుడ్ సినిమా ను మించి వ్యూస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఎంతో మంది ప్రముఖుల చేత ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఆరాటపడుతుంది.ఆస్కార్ నామినేషన్ కి ఇండియా తరఫున ఛాన్స్ దక్కలేదు.
దాంతో నేరుగానే ఆస్కార్బరిలో నిలవాలని జక్కన్న టీం నిర్ణయించుకుంది.అందుకోసం దరఖాస్తు కూడా చేసేందుకు అంతా సిద్ధమైంది.
ఊరికే దరఖాస్తు చేసి ఊరుకోకుండా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకు వెళ్లాలని జక్కన్న భావిస్తున్నాడట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 50 కోట్ల రూపాయలను రాజమౌళి ఆస్కార్ కోసం ఖర్చు చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
సినిమా కు వచ్చిన లాభాల్లోంచి ఆ మొత్తం నిర్మాత ఇచ్చేందుకు ఓకే చెప్పాడట.సినిమా ఆస్కార్ బరిలో నిలవాలి.నామినేట్ అవ్వాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా కచ్చితంగా గొప్ప పబ్లిసిటీ కావలసి ఉంది.
అందుకే సినిమా కు భారీ ఎత్తున పబ్లిసిటీ నిర్వహించేందుకు గాను రాజమౌళి ఇప్పటికే జపాన్ లో పర్యటిస్తున్నాడు.అక్కడ సినిమా ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యాడు.అంతే కాకుండా ఇటీవల అమెరికాలో కూడా రాజమౌళి పర్యటించిన విషయం తెలిసిందే.
ఇలా దేశ విదేశాల్లో రాజమౌళి టీం పర్యటించి ఆస్కార్ కోసం మరింతగా కష్టపడబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఆస్కార్ లో కనీసం నామినేషన్ దక్కితే కచ్చితంగా జక్కన్న పడ్డ కష్టం కు ఫలితం దక్కినట్లే మరి ఆస్కార్ నామినేషన్స్ దక్కుతాయా లేదా అనేది చూడాలి.