ఈ నూనెను వారానికి రెండుసార్లు రాస్తే జుట్టుకు అంతా ఉపయోగం ఉందా...

ప్రస్తుత కాలంలో మగ, ఆడ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో చుండ్రు, జుట్టు రాలే సమస్యలు అధికంగా ఉన్నాయి.వాటికోసం డాక్టర్లు స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు.

 Applying This Oil Twice A Week Is Beneficial For Hair ,oil, Hair,dandruff , Hair-TeluguStop.com

కొంతమంది ఇలాంటి ట్రీట్మెంట్ భయపడి ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకొని వారు చెప్పినట్లు ఆయుర్వేద మందులను ఉపయోగిస్తూ ఉన్నారు.ఇంకా చెప్పాలంటే ఈ సమస్యలు రాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.

అలా మార్కెట్లో దొరికే షాంపులు, హెయిర్ ఆయిల్ వాడడం వల్ల అప్పటికి అప్పుడు కాస్త బాగానే అనిపించినా కొన్ని రోజుల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతిలో నూనెను తయారు చేసుకుని వాడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

ఇలా ఒక్కసారి చేసుకుంటే ఈ నూనెను నెల రోజులపాటు భద్రంగా ఉంచుకొని వాడవచ్చు.ఈ సహజ సిద్ధమైన నూనెను ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక గ్లాసు సీసాలో ఒక స్పూన్ డ్రై పెటల్స్ వేసుకోవాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ మెంతి పొడి కూడా కలుపుకోవాలి.ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ కునంజి సీడ్స్, 6 మందార పువ్వు రేకులు, ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె, చిన్న ముక్క వంటి వేరు, అర కప్పు బాదం నూనె వేసి బాగా కలిసేలా చేసి మూత పెట్టి ఐదు రోజులపాటు అలాగే వదిలి వెయ్యాలి.

Telugu Dandruff, Fall Problems, Tips, Effects-Telugu Health

ఆ తర్వాత ఒక పల్చని మంచి శుభ్రమైన అవసరం సహాయంతో ఆ నూనెను ఫిల్టర్ చేసి ఒక గాజు బాటిల్లో పోసుకొని ఉంచాలి.ఇలా తయారు చేసుకున్న నూనెను ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు తలకు పట్టించి ఐదు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తల స్నానం చేయడం మంచిది.వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube