రాహుల్ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా పైనే మొదటి సంతకం జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు..!!

2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ విభజన జరగటం తెలిసిందే.ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

 Jairam Ramesh's Sensational Comments Are The First To Sign Special Status For Ap-TeluguStop.com

పార్లమెంటు సాక్షిగా విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం జరిగింది.అయితే ఇప్పటివరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించలేదు.

ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ పార్టీలు ఎవరికి వారు హామీలు ఇచ్చారు.అయినా కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించలేదు.

ఇటువంటి తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత జైరాం ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా పై తొలి సంతకం చేస్తారని అన్నారు.

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి రాహుల్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దాదాపు 119 స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు లేరని అన్నారు.బీఆర్ఎస్ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో టిఆర్ఎస్ … కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉందని జైరాం రమేష్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube