‘గడపగడపకు ప్రభుత్వం’ అన్నది ఓ విశిష్ట కార్యక్రమం.దీనిని నిరంతరాయంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం ఆహ్వానించదగినది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి.సమాచార సాంకేతిక విప్లవం అందుబాటులోకి వచ్చాక ప్రజాప్రతినిధులపై బాధ్యతలు పెరిగాయి.
వారికి పనిభారం పెరిగిన మాట కూడా నిజం.కానీ, ప్రజాసేవలో ఉండే ఆనందాన్ని ఆస్వాధించగలిగిన వారే రాజకీయాలలోకి వస్తారు కనుక నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ కార్యాచరణను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పని తీరుతోపాటు పార్టీ నేతల భాగస్వామ్యం, అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వారు చూపుతున్న శ్రద్ధ తదితర అంశాలను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించడమేకాక తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.
పనితీరు సరిగాలేని పార్టీ నేతల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
పనితీరు మార్చుకోకుంటే తప్పిస్తానని నిష్కర్షగా చెబుతున్నారు.ఇవన్నీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.
ప్రజలకిచ్చిన హామీలలో 97 శాతం మేర నెరవేరుస్తున్నందున ప్రజలలో సంతృప్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనా.అయితే, ప్రజల సంతృప్తి అన్నది మొత్తంగా ప్రభుత్వంపైన, తాము ఎన్నుకొన్న ప్రజాప్రతినిధి పనితీరు పైన, అధికార యంత్రాంగం స్పందనపైన ఆధారపడి ఉంటుంది.
ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నదాంట్లో అబద్ధం ఏముంది? ఎన్ని పనులు చేసినా ఇంకా చేయాల్సినవి ఉంటూనే ఉంటాయి.ప్రజలను ఎప్పటికప్పుడు కలుసుకొంటూ వాస్తవాలను వివరిస్తే వారు అర్ధం చేసుకొంటారు.
అలాకాక, ప్రజలకు మొహం చాటేస్తే లేదా సమాధానం చెప్పకపోయినప్పుడే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.‘గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం’లో అక్కడక్క ఎమ్మెల్యేలను ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న మాట నిజమే.అయితే, దాని గురించి బెంబేలు పడాల్సిన అవసరం లేదు.నిజానికి ఏ పాలకుడి వద్ద రాత్రికిరాత్రే అద్భుతాలు సృష్టించే మంత్రదండం ఉండదు.కష్టపడాల్సిందే.అందరి సహకారం స్వీకరించాల్సిందే.
అప్పుడే ఫలితాలు అందుతాయి.కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు.
అయితే, ఎవరైతే నిజాయితీతో కృషి చేస్తారో అటువంటి నాయకులను ప్రజలు తిరస్కారభావంతో చూడరు.క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మచ్చతెచ్చే నాయకులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉంది.
కొంతమంది నాయకులు స్వార్ధంతో చేసే పనులు కొన్ని రాజకీయ పక్షాలకు అస్త్రాలుగా మారతాయి.వాటిని గోరంతలు కొండంతలు చేసే ప్రమాదం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో.ప్రభుత్వానికి ఎవరు చెడ్డపేరు తెస్తున్నారు? ఎవరు మంచి పేరు తెస్తున్నారు? అనే సమాచారాన్ని తెప్పించుకొని.ఆదిలోనే చర్యలు తీసుకొన్నట్లయితే పార్టీకి లాభం కలుగుతుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దిట్టమైన గుండెబలం ఉంది కనుకనే ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ధైర్యంగా ముందుకు సాగగలుగుతున్నారు.
ఆ గుండె ధైర్యం, నైతిక బలం ఆయనకు పేద ప్రజలు, సామాన్యులు, బడుగుబలహీన వర్గాలు అందిస్తున్న సహాయ సహకారాల నుంచి వచ్చింది.లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలుసు కనుక.
ఆ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఎదురవుతున్న అడ్డంకుల్ని అవలీలగా దాటగలుగుతున్నారు.ప్రజలతోపాటు ప్రభుత్వ యంత్రాంగం ఆయన ఆలోచనలకు అనుగుణంగా పని చేయగలుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వేచ్ఛగా పని చేయించుకొనే వెసులుబాటు కల్పించారు.క్రిందస్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగి వరకు అందర్నీ పాలనలో భాగస్వామ్యం చేస్తున్నారు కనుకనే ఆశించిన ఫలితాలు అందగలుగుతున్నాయి.